11, ఏప్రిల్ 2013, గురువారం

శ్రీకాంత్ మీకు సమాదానం చెప్పడం జరిగింది.

 శ్రీకాంత్ మీ బ్లాగు మొత్తాన్ని గమనించినత్లయితె కమ్యునిజం పైన రాసిన టపాలన్నీ కేవలం విమర్శ తప్ప విషయం లేదు. మీరు పాడిన పాచిపొయిన పాటలు 1867 నుంచీ వున్నాయి కాకపొతె మీ పాటలు మరీ పేలవంగ వున్నాయి వాటిల్లొ సైయీ ,సారం లేదు.   సిద్దాంతపరమైన చర్చ అసలే లేదు. అక్కడా ఇక్కడా ఏరుకున్న పైపైన చెత్తను వేరుకుని అదే విమర్శ అని అపొహాలొ వున్నారు. ఇంతకన్నా ఘటుగా సిద్దాంత చర్చలొకి కొంతవాకు దిగి మాయమైన వాళ్ళు వున్నారు.వాటిల్తొ పొల్చుకుంటె మీది లెక్కలొకి రాదు.  మార్కిజం గురించి మీరు తెలుసుకున్నదంత విశెఖర్ గారు మార్కిజం గురించి ఆయన బ్లాగులొ అక్కడక్కడ తడిమారు.దాన్ని పట్టుకునే మీరు ఎంతచేపటికీ వేలాడుతున్నారు. అదే మీకు తెలిసిన మర్కిజం.బావిలొ వున్న కప్ప ఇదే ప్రపంచం అనుకుంటుంది . అదేవిధంగా శెఖర్ గారి బ్లాగే మీకు మార్కిజంగా కనపడుతుంది.  మార్కిజాన్ని విమర్శిస్తూ ఇన్ని టపాలు రాసినారు కదా యక్కడైనా సిద్దాంతపరమైన చర్చలొకి దిగి ఇది అశాస్త్రీయంగా వుందని గాని లేక పలాన దగ్గర ఇలా వుందని కొడ్ చేస్తూ అది ఎవిధంగా తప్పొ నిరూపించడం ఇంతవరకు చేయలేదు. మార్కిజం గురించి ఓన మాలు కుడా తెలియకుండా  విమర్శ చేయడం  కొత్తతేమీ కాదు. గతంలొ చలం గారి గురించి  యవరొ పేపర్లొ విమర్శగా రాస్తె దాన్ని పట్టుకుని వెకటేస్వర్ రావు. అనే ఆయన యేకంగ పుస్తకమే రాశారు.ఆయన రచనలు ఎమీ చుడకుండానే!!. ఇలాంటి వెంకటేస్వర్ రావులు వేలకు వేలు వున్నారు.  మర్కిజం గురించి ఎమీ తెలియకుండానే ఇంతటి కక్ష, ద్వెషం, ఎందుకు పెంచున్నారొ ఆయానకే తెలియలి. ఇక ఆయన లేవనెత్తి ఇలాంటి ప్రశ్నెలకు గతంలొ నేను   జవాబు చెప్పివున్నాను.  హుతుబద్దం, లేదా తార్కికంగా   నిలబ్బడం గాని ఆయనకు తెలియదు.నేచెప్పిందే నెగ్గాలి అనే పంతం అడుడడుగునా కనిపిస్తుంది.ఇక ఆయన లేవనెత్తిన ప్రశ్నెలకు జవాబు చెపుతాను.

     1 మార్కిస్టులు మతం మత్తుమందులాంటిదని అంటూ వుంటారు దానికి కారణమేమిటి?
 కార్మిక వర్గం నిత్యం అనేక సమస్యలలొ కొట్టుమిట్టాడుతూ వుంటుంది. తమకష్టాలకు  పుర్వజన్మ పాప పున్యాలు కారణమని లేక ఆ కష్టాలను దేవుడే గడెక్కిస్తాడని తాత్కాలికంగానైనా మనస్సును శాంతింపచేసుసుకుంటారు. అసలు కారణం తెలియక. అందుకే మతం మత్తుమందులాంటిదని అంటారు.
2.అనేక కారణాల వల్ల మార్కిజం కుడా మతంలా మత్తుమందులంటిదవదా? మార్కిజంలొ కుడా మతము లాగానే అనే అపొహాలు వున్నాయి.చాలా అన ర్దాలకు కారణం అయ్యింది కదా?
నేను ముందుగానే చెప్పినట్టు విమర్శ వుంటుంది కాని విషయం వుండదు. అనేక కారణాలు వుంటె ఒక్క కారణమైన చెప్పి యాడవచ్చు కదా? ఆహా దాని జొలికి పొడు పొవడానికి విషయం వుంటే కదా.

3. మార్కిస్టు పాలనలొ అనేక మానవహక్కుల ఉల్లంగన జరిగింది స్టాలిను, మావొలు వలన ఎన్నొ కొట్లమంది చనిపొయినారు. ప్రజాస్వమ్యంలొ అయితె చట్టబద్దంగా పొరాడే అవకాశం వుంటుంది. కమ్యునిస్టుదేశాలలొ ఆ అవశశం లేదు. ఇది ఆయన ఇండొ పేరాలొని సారాశం.

 కమ్యునిజవైపుగా రష్యా , చైనాలొ కొన్ని అడుగులు వేశాయి తర్వాత తిరొగమనం పట్టాయని చెవిలొ జొరీగ లాగ ఎన్ని సార్లు చెప్పినా అదే ప్రశ్నె మల్లి అడుగుతారు ఇక స్టాలిన్ గురించి చెప్పాలంటె అతన్ని ఆపదవికి అర్హుడు కాదని లెనిన్ చివరిదశలొ చెప్పినాడు.కాని ఆ లెఖను బయటకు రాకుండా చేసి స్టాలిన్ అధికారంలొకి వచ్చినాడు. అతను చనిపొయేవరకు అది బయటకు రాలేదు.తర్వాత అతని వ్యతిరేక వర్గం  దాన్ని బయటపెట్టింది. అంటె వాళ్ళు ఉత్తములనికాదు కేవలం అధికారం కొసం బయట పెట్టినారు. ఇక మావొ గురించి అయితే వ్యక్తిగత పుజలు చేయించుకున్నాడు ఇలాంటి తప్పిదాలు తప్ప మారణహొమం అంటూ ఎమీ చేయలేదు. ఒక బుర్జువ పార్టీ లొకి కమ్యునిస్టులు చొరబడలేరు.కాని ఒక కమ్యునిస్టు పార్టీలొకి బుర్జువాలు చొరబడగలరు. ఎందుకంటె అది ఇంకా ప్రరంభదశలొనే వుంది కనుక. విరుద్ద ప్రయొజనాలు వున్నాప్పుడు దేని బలాబలాలను బట్టి దాని వర్గ ప్రబల్యం వుంటుంది.

4.మతాలన్నీ మంచే చెపితే దాన్ని అనుసరించె మనుషులు చెడుచేయడం తర్కించవలసిన విషయం.మనుషులనుండి వేరుగా వున్నట్లయితె మతమైనా మరేదైనా వౄదా కాదా.ఇది శెఖర్ గారి కొడ్ దీన్ని మార్కిజానికి అన్వయించి అడిగారు శ్రీకాంత్.

దీన్ని నేను శెఖర్ గారి బ్లాగులొనే ప్రశ్నించాను దీని పైన ఇంకా ఆయన సమాదానం ఇవ్వలేదు. మతాలన్నీ మంచే చెపుతాయి  అందులొ ఎమీ సందేహం లేదు. కాని అందులొ ఏది మంచి ఏది చెడు అనేది వర్గ దౄష్టితొ పరిశీలించినప్పుడు మాత్రమే అవగతమౌతాయి. అందరికీ సహాయపడాలని మతం చెపుతుంది.కాని ఒకరు సహాయం చేసే స్తితిలొ ఎందుకున్నారు ఇంకొకరు చేయించుకొనే స్తితిలొ ఎందుకున్నారు లాంటివాటికి ఎం జవాబు చెపుతుండంటె పుర్వజన్మ ఫలం , లేదా కర్మ పాప ఫలాలు  కారణాలుగా చెపుతుంది. మరి ఆజన్మలొ ఎందుకున్నారు దానికన్నా ముందుజన్మగా కారణం చెపుతారు మరి ఆజన్మలొ ఇక దీనికి అంతం లేదు. అలాగే పరులసొమ్ము పాము వంటిది ఇది ఒక నీతి వాఖ్యం ఇందులొ తప్పుపట్టాల్సినదేమీ లేదు.మరి ఒకరు దొంగతనం చేయాల్సిన స్తితిలొ ఎందుకున్నారు.? ఇదే మతానికి సంఘానికి వున్న వైరుద్యం. బౌతిక పరిస్తితులు ఒకలా వుంటె మనిషి ఇంకొలా ప్రవర్తించలేడు. నీతి ఒకలా వుంది దానికి విరుద్దమైన బౌతికపరిస్తితులు ఇంకొలా వున్నాయి. ఇక మార్కిజం 100 కి 99 మందికి తెలియదు దాన్ని ఆచరించడమనేది తర్వాత.

5. మర్కిజం పుస్తకాలలొ పగటికలకు కనడనికి బౌశత్తు నాశనం చేసుకొవడానికిచేసుకొవడనికి ఈ మార్కిజం దేనికి ఉపయొగపడుతుంది.

బంగారు కొండ శ్రీకాంత్  చరిత్రను ఎప్పుడైనా గమనించావమ్మా. పొరాటాలు గాని లేక విప్లవాలు గాని లేకుండా వుంటే సమాజం ఇంకా బానిసస్తితిలొనే వుండేది. నీవు ఒకడికి అమ్ముడుపొయి నీ బిడ్డలు ఇంకొకడికి అమ్ముడుపొయి.  చెట్టుకొకరు పుట్టకొకరు విడిపొయి నిరంతరమైన శ్రమ వాడికి కొపం వచ్చినప్పుడు నిన్ను చంపివేయవచ్చు. కుడా ఆస్తితిలొ నిన్ను నీవు ఒక సారి ఊహించుకొ.మార్కిజం పగటికలొ లేక బౌతికశక్తితొ అర్దమౌతుంది. మర్క్స్ పెట్టుబడి తన ఇష్టా ఇష్టాలతొ రాయలేదు.గనితమంత ఖచ్చితత్వంతొ కౌలు, వడ్డి, లాభం లాంటి పేర్లతొ కార్మికుడి శ్రమ ఎలా దొపిడీ అవుతుందొ శాస్త్రీయంగా నిరూపించినాడు. ఈనాటికీ అంటె 1867 లొ పెట్టుబడి ద్వార బయట పడిన తర్వాత కుడా బుర్జువా అర్ద శాస్త్రానికి విలువంటే ఎమిటొ తెలియదు. తెలిసినా విద్యార్దులకు చెప్పరు.వాళ్ళ కన్ను వాళ్ళే పొడుచుకొలేరు కదా.

6.మార్కిజం నిరంకుశ దొరణులకూ, మానవహక్కుల ఉల్లంగనకూ, ఒక రూపాన్ని కల్పించడం జరిగిందనీ అనేకమంది మంది చరిత్రకారులూ, మేదావులూ చెప్పారు కదా ? మరి వాటివిషయేం చేస్తారు.

నేను ఇంతకు ముందే చెప్పినాను విమర్శ వుంటుంది కాని విషయం వుండదు. యవరా చరిత్రకారులూ, మేదవులూ, కొంచమన్నా వివరణ ఇవ్వవచ్చు కదా? సరే అలా చెప్పారే అనుకుందాం పరస్పర విరుద్ద ప్రయొజనాలు ఉన్నప్పుడు లేదా పరస్పర శత్రు వర్గాలు వున్నప్పుడు ఎమైనా మాట్లాడతారు. ఇంగితం వున్నవాళ్ళు రెండింటిని పరిశీలించి అది మానవ హక్కులను ఎమి ఉల్లంగించిందొ ఎలా ఉల్లంగించిందొ చెప్పాలి. మానవుడు అంటె మిగత జంతుజాలం నుంచి వేరు చేయడాని మానవుడని చెప్పవచ్చు. రొండు వర్గాలుగా వున్నప్పుడు మనవుడంటె ఎ మానవుడని వేల కొట్లు వున్నవాడు  మానవుడే అడుక్కుతినేవాడూ, మానవుడే. సందేహం లేకుండ చెప్పవచ్చు ఆ చరిత్రకారులూ,ఆ మేదావులూ, శ్రీకాంత్ లాంటి వారేనని.

  తీవ్రవాదానికి మతమే కారణం అని యవరూ చెప్పలేదు.అన్ని మత మనుషులూ కొంతమంది తీవ్రవాదాన్ని సాగిస్తున్నారని చెప్పినారు.

7. మార్కిజమే గొప్పదని నమ్మిన సమాజాలు మార్కిజపు సిద్దాంతాన్ని నమ్మిన మనుషులు చేసే దౄష్ట చర్యలను మార్కిజం ఆపలేకపొఇంది కద? మరి మార్కిజం వౄదా కాదా ? దేనికి పనికివస్తుంది మార్కిజం ? ఆచరించని నీతులు తెగ చెప్పుకుని ఏమి లాభం మార్కిజానికి అసలు అస్తిత్వమే లేదని దీన్ని పట్టి అర్దమవ్వడం లేదా ? మానవ హక్కుల వుల్లంగనకూ, వామపక్ష తీవ్రవాదానికీ,కమ్యునిస్టు సాగించి నరమేదానికీ మార్కిజం ఒక frame work లాగా ఉపయొగపడుతొది కదా?

  మార్కిజ గొప్పదని నమ్మిన సమాజలంటె మీ అర్దం రష్యా, చైనా, లే కదా? ఎదైనా పదార్తానికి గాని లేదా  ఒక వస్తువుకుగాని, లేదా   ఒక జీవికి గాని ఆయా దర్మాలు  , లేక గుణాలు వుంటేనే    ఆయా వస్తువులుగ లేదా జీవులుగా పరిగనింపబడతాయి.  నేను ఇంతలు ముందే చెప్పినాను అవి తిరొగన దేశాలని.అంటె పక్కా పెట్టుబడిదారీ దేశాలని.మార్కిజం దేనికి పనికి వస్తుందొ నీఒక పెట్టుబడిదారుడవైవుంటె నీపైన తిరుగుబాటు చెసినప్పుడు ఆ తిరుగుబాటు చేసిన కర్మిక వర్గనికి తెలుస్తుంది మార్కిజం దేనికి పనికివస్తుందొ.లేదా నీవు కార్మిక వర్గానికి చెందినవాడవైతె (మేదా శ్రమ చేచేవాళ్ళు కుడా కర్మిక వర్గం కిందికే వస్తారు)  నీ వర్గం బానిసత్వం అర్దం కాని మూర్కుడికిందకు వస్తావు. నీతులు చెప్పడనికి అదేమీ మతం కాదు. శాస్త్రీయమైన సిద్దాంతం.కార్మిక వర్గం ఎందుకు పొరాడాలొ పట్టపగలంత స్పష్టంగా శాస్త్రీయంగా వాళ్ళ బాదలకు కన్నీళ్ళుకు గల కారణాలను వివరించింది , మీలంటి పెటీ బుర్జువాకు (అంటె అటు పెట్టుబడిదారీ వర్గం కాదు ఇటు కార్మిక వర్గం కదు. మద్యరకం వ్యాపరులన్న మాట.) ఎన్నటికీ అర్దం కాదు. దానికి అస్తిత్వం  వుందొ లేదొ తలకిందులుగా కాకుండా సరీగా నిలబడు .వెన్నుముఖ వుందా? కళ్ళుతెరిచి చూడు కనపడకపొతె కంటి డాక్టరు దగ్గరకు వెళ్ళు ఒక పక్క పంచబక్షపరమాన్నాలు మరొపక్క తాగడానికి గంజికుడా లేదు. ఒక పక్క ఆకాశమంత భవంతులూ, మరొపక్క గుడిచైనా లేని నిర్బాగ్యులు. భుమండలంలొని భూమి, ఘనులూ, ప్యాక్టరీలూ, సమస్త వనరులూ కొద్దిమంది చేతులలొ పొగుపడి వున్నాయి.అదంతా కార్మికుల శ్రమ  అది కర్మికుల శ్రమ ఎలా అవుతుందొ "పెట్టుబడి" పుస్తకాన్ని చదువు తెలుస్తుంది విలువ అంటె ఎమిటొ శ్రమ అంటె ఎమిటొ లాబాలకు,  వడ్డీలకు   గల కారణాన్ని పట్టుకుని చరిత్రలొ మొదటి సారిగ పేద, ధనిక గల కారణాలను శాస్త్రీయంగా  వివరించాడు.

  చివరిగా ఒక మాట  ఇదంతా నేను శ్రీకాంత్  కొసం రాయలేదు. అతని తత్వం నాకు బాగా తెలుసు. ఈ గొడంతా ఎందుకంటె యవరైనా మార్కిజంపైన అపొహాలు వుంటె వాళ్ళైనా కళ్ళు తెరుస్తారని చిన్న ఆశ.