19, జూన్ 2012, మంగళవారం

తెలకపల్లి రవి గారూ ఇది మీకే.

 తెలకపల్లి రవి గారూ.
    రంగనాయకమ్మ గారు బుద్దుడిని తన ఇష్టా ఇష్టాలతొ  విమర్శించారా లేక అంబెద్కర్ చెప్పిన దాని ప్రాకారం విమర్శించారా? అసలు బుద్దుడి ఎందుకు విమర్శించల్సివచ్చింది ? సామాజిక సమస్యలకు అంబెద్కర్ బుద్దుడిని మార్గంగా చుపారు. ఫలితంగా బుద్దుడిని కుడా విమర్శించవలసి వచ్చింది. మీరన్నట్టు బుద్దుడి భావజాలాన్ని విమర్శించలేదు.  అంబెద్కర్  వ్యాఖ్యలేవో రంగనాయకమ్మ  వ్యాఖ్యలేవో మీకు అర్దం కాకపొవచ్చు మీలాగ అందరికీ అర్దంకావని అనుకొవాలా? ఆమె శైలి గురించి మీరు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు ఆమె పాఠకులకు తెలుసు.


   అంబెద్కర్ ను ఆమె ఎంతగా విమర్శించారొ అంతగా ఆయన చేసిన కౄషి గురించి పుస్తకం పొడవునా చెప్పేరు. అలాగే ఆయన మార్కిజానికి అణగారిన వర్గాను దూరం చేసినందుకు కఠినంగా దుయ్యపట్టెరు. మీలాగా కట్టె విరగాకూడదు పామూ చావాకూడదు అనే  పద్దతిలొ కాకుండా . చాలామంది సంస్కర్తలకు  మార్కిజం గురించి తెలియకుండా అశాస్త్రీయంగా రాసినా అది సహజం కాని అంబెద్కర్ మార్కిజం ఏంచెపుతుందొ తలకు యక్కకుండా దానికి వీపుతిప్పి ప్రతిదాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు. ఫలితంగా ఈనాడు అణగారిన వర్గాలు మార్కిజానికి దూరం అయినారు.



   అంబేద్కర్ ఏనాడొ రాసినవి కాదు వేలు వందల సంవత్సరాలు కాలేదు ఈమద్య రాసినవే అదీ మార్స్కిజాన్ని విమర్శిస్తూ.అలాంటి వ్యెక్తిని ఏ చారిత్రక పరిస్తితిని   దృష్టిలో పెట్టుకుని విమర్శించాలి.? మార్కిజం గురించి తెలియని వారూ ఆయన పేరు వినని వారూ అశాస్త్రీయంగా రాయడం సహజమే అలాంటి సహజ అంశాలు అంబేద్కర్ లొ వున్నాయా?

   సమాజం గాని ప్రకౄతి గాని నిరంతరం  చలనంలొ వుంటాయనే విషయం  మీరు చెపితేగాని రంగనాయకమ్మకు తెలియదా? చలం సాహిత్యం గురించి మీలాంటి కమ్యునిస్టులు ఆయన అశాస్త్రీయంగా రాశారని ఇష్టం  వచ్చిన కూతలు కూస్తుంటే విమర్శ అనేది యలావుండాలొ ఆయా చారిత్రక పరిస్తితులు దృష్టిలో పెట్టుకొని ఏలా విమర్శ చేయాలొ మార్క్స్, లెనిన్ చెప్పినవి ఆదారం చేసుకొని సమగ్రంగా వివరించారు.

  అంబేద్కర్ ప్రభావంలొ వున్నవాళ్ళను నొప్పి తగలకుండా వెన్న పూసినట్టు వుండాలన్న మాట. ఏది హేతుబద్దంగా వుంది ఏది తర్కంగా వుంది అనేదానితొ సంభందం లేకుండా . ఇక్కడ ప్రధానంగా తీసుకున్నది అంబేద్కర్నే .కొశాంబి ని గాని శర్మను గాని కాదు. వాళ్ళు రాసింది ప్రస్తావించడానికి. అంబేద్కర్ కులాల పుట్టుపుర్వొత్తరాలు కనుక్కొవడాని మతాలనేకాక జంద్యంలొ ఎన్ని పొగులు వుంటాయి లాంటి వాటి పైన సమయానంతా వెచ్చించాడు దీన్ని ఆమె గొడ్డుచాకిరీతొ పొల్చారు అదీ కొపంతొ కాదు
అలాంటి తెలకపల్లి రవి గారికి ఆసక్తి కరంగానూ చర్చించ తగినివిగానూ తొస్తున్నాయి.


  రిజర్వేషన్ అనేవి తాత్కాలిక పరిస్కారాలు మాత్రమే అవే శాస్విత పరిస్కారాలుగా భావించ కూడదు. దీని ద్వి ముఖాలు వున్నాయి ఒక అర్దంలొ రిజర్వేషన్ అనేది మంచిదే కాని దాన్నే శాస్విత పరిస్కారంగా భావిస్తె అది భానిసత్వమే దీన్నే  ఆమె చెప్పేరు అది రవి గారికి పొంతన లేని తనంగా కనపడుతుంది.  ఆమె ఏమి చెప్పినా తిరస్కరించాలనే దృష్టి తొ వున్నారు. అందుకే ఆమె చప్పనివి చెప్పినవి మీకు అనుకూలమైనవి వేరుకుని మరీ విమర్శిస్తున్నారు.అందుకు నిదర్శనం మీరు రాసిన అపసవ్య వ్యాఖ్యలు. ఆమేదొ కులాల వారిని సంఘాల వారిని కలుపుకొని పొవద్దన్నట్టుగా విమర్శించారు. ఆమె బుద్దుడిని ఎందుకు విమర్శించారొ పరిగణలొకి తీసుకొకుండా ఆమె 2500 సంవత్సరాల భావజాలాన్ని విమర్సించినట్టుగా మీకు అనుకూలంగా రాసుకున్నారు. దాన్ని విమర్శించిన నేను ఆమె బక్తుడిగా జమకట్టెరు. దీన్ని బట్టి మీకు అనుకూలంగా రాసి వాళ్ళు మీకు బక్తులన్న మాట.

 రంగనాయకమ్మ గారు అన్నట్టు గురువు గాని నాయకుడు గాని భొధించిన విషయాల్లొ సరైన దాన్ని తీసుకుని సరికానిదాని తిరస్కరించాలి తప్పుల్ని ఒప్పుల్ని ఒకే విధంగా భరించ కూడదు  ప్రేమ అయినా బక్తి అయినా విచక్షణా రహితంగా వుండకూడదు.

 కమ్యునిస్టు ముసుగులొ వుండి మార్కిజానికి ద్రొహం చెయ్యడం ఇదేమీ తెలకపల్లి రవిగారితొ మొదలవ్వలేదు. ఒక్కమాటలొ చెప్పాలంటే రవి గారు గొర్రెతొలు కప్పుకున్న తొడేలు వంటి వారు.

8, జూన్ 2012, శుక్రవారం

తెలకపల్లి రవిగారి విమర్శకు ప్రతి విమర్శ

  కులాలూ,మతాలూ, లాంటి వాటికి స్వంత అస్తిత్వం వుండదు సమాజంలొ వున్న ఆర్దిక అసమానతలను అంటిపెట్టుకుని జీవించే పరాన్న జీవులు. కులాల సమస్య పరిస్కారాలను చుసిస్తూ అంబేద్కర్ అనేక పుస్తకాలు రాశారు కులాల,సమస్యలకుగాని,ఆర్దిక సమస్యలకుగాని మార్కిజం పనికిరాదనికుడా శలవిచ్చారు. దానిపైనే చర్చిస్తూ రంగనాయకమ్మ గారు "దళితసమస్య పరిస్కారానికి బుద్దుడు చాలడూ, అంబేద్కర్ చాలడూ, మార్క్స్ కావాలి" అనే పుస్తకం రాశారు .

   దానిపైనా,మరియూ, ఈమద్య ఆంద్రజ్యొతిలొ రాసిన అస్తవ్యెస్త సంస్కర్తలూ, అనే వ్యాసం రాశారు. ఈరొండిటిపైనా విమర్శగా తెలకపల్లి రవి గారు విమర్శగా "అపసవ్య వ్యాఖ్యతలు"  అనే వ్యాసం రాశారు దానికి సమాధానంగా రాస్తున్నాను.
 
    సుందరయ్యను కమ్యునిస్టు గాందిగా అనేక దాశాబ్దాలుగా చేస్తున్నదే కనుక దాన్ని తప్పు పట్టాల్సిన పని లేదని అంటున్నారు. రవి గారు. ఈయన గతంలొనూ జ్యొతిష్యం అనేకమంది నమ్ముతున్నారు కనుక తప్పుపట్టాల్సిన పనిలేదని అన్నారు. ఈయన ప్రకారం అనేకమంది ఏంచేసినా తప్పులేదు. కాకపొతె ఆసేసెదాంట్లొ అనేకమంది వుండాలి అప్పుడు తప్పుపట్టాల్సి పనిలేదు. ఈయన కొత్తగా కనిపెట్టిన సిద్దాంతం ఇది. ఈయన ప్రకారం అనేకమంది అనుకునే సామాజిక విషయాలలొ సైన్సు ప్రమేయం వుండకూడదు ఎందుకంటే అనేకమంది అనుకుంటున్నారు కాబట్టి.

   '"వేరు వేరు కాలాల భావజాలకు సంభంధించిన  వ్యెక్తులను పొల్చి వాధించడమే  అశాస్త్రీయం"
   రంగనాయకమ్మ గారు వేరు వేరు కాలాలకు సంభంధించి వ్యెక్తులను విమర్శించడం తన ఇష్టా ఇష్టాలతొ చేయలేదు. అంబేద్కర్ సామాజిక సమస్యలకు బుద్దుడు దర్మాన్ని పరిస్కారంగా చుసించాడు.మార్కిజం పనికిరాదని ఒకపేరాలొ అంతలొనే మార్క్స్ చెప్పినాటివన్ని బుద్దుడు చెప్పేడని ఒక పేరాలొ ఇలా పొంతన లేకుండా చెప్పెడు. కనుకనే బుద్దుడిని విమర్శించవలసి వచ్చింది. ఈవిషయాన్ని వదిలేసి తెలకపల్లి రవిగారు వేరు వేరు కాలాలకు భావజాలాన్ని విమర్శించడ అశాస్త్రీయం అని తన ఇస్టమొచ్చిన భాష్యాలు చెపుతున్నాడు. 

  అస్తిత్వ వాదాన్ని యవరూ వ్యెతిరేకించలేదు వేరు వేరు సంగాల వారిని కలుపుకొనిపొవద్దని యవరూ అనడంలేదు.ప్రదాన సమస్యను వదిలి సెకండరీ సమస్యపైన ఎంత పొరాడినా వుపయొగం వుండదు. ఆవిషయాన్నే ఆమె విమర్శించారు తెలకపల్లి లాంటి కులగజ్జి నాయకులు అర్దం చేసుకొవడం లేదు. లెనిన్ ని ప్రమానికంగా తీసుకొలేదని మీరెలాచెప్పగలరు.?

 సుందరయ్య వర్దంతి సభలకు బురువాలు కుడా వస్తున్నారంతే దానర్దమేమిటి ? రొండు వైరుద్యాల మద్య ఘర్షణ లేకుండా ఐఖ్యం ఐనారంటె రొండూ ఒకటయ్యాయని అర్దం పేరుకు మాత్రమే కమ్యునిస్టులు సిద్దాంతపరంగానూ, భావజాలపరంగానూ, ఈరొండిటిమద్య ఏమాత్రం తేడా లేదు. మార్కిజాన్ని ఏదేశానికి తగినట్టు ఆదేశం అన్వయించుకొవడంటే ఎలా అన్వయించుకొవాలి ఏవిషయంలొ అన్వయించుకొవాలి? మార్కిజమంతా శ్రమదొపిడీపైన ఆదారపడివుంది . ఇక దాన్ని వదిలేసి బుర్జువా సంస్కరణలకు పరిమితమౌవ్వాలి. ఇప్పుడు చేస్తున్నది అదే.  మార్కిజం ఆశయ సాదనకొసం అహొరాత్రులూ కౄషిచేస్తున్నారంట !! cpm పార్టీ 30యెళ్ళపాటు అదికారంలొవుండి ఏంచేసింది.?  పేదల భూములను పారిశ్రామికవెత్తలకు పంచిపెట్టింది దాన్ని అడ్డుకున్న పేదలను cpm గూండాలతొ కాల్పులు జరిపించింది.

  ఇక చివరిగా తెలకపల్లి రవిగారి గురించి చెప్పుకుందాం. T.V.  లలొ సినిమా పొగ్రాములకు యాంకర్లు ఆయా బ్యనర్లనుబట్టి ఆయా హీరొలను పొగుడుతూ వుంటారు. ఈయనను రాజకీయ విశ్లేషకుడుగా ఆయా వార్తా చానళ్ళు  పిలుస్తూ వుంటారు. ఆయా చానళ్ళకు తగినట్టు గానే మాట్లాడుతూ వుంటారు. ఈయన కమ్యునిస్టు అట!!.

4, జూన్ 2012, సోమవారం

పురాతన సమాజం

 చరిత్రను బౌతికవాద దౄక్పదం తొ పరిశీలించే పద్దతిని అప్పటికి 40 యేళ్ళ క్రితమే  మార్క్స్ కనుగొన్నాడు . దానినే తన సొంత పద్దతిలొ అమెరికాలొ "మొర్గాన్"మళ్ళి కనుగొన్నాడు . 

  సమాజ పరిణామ క్రమాన్ని అత్యంత నిశితంగా సవివరంగా శాస్రీయంగా పరిశీలన చేసిన గ్రంధమే పురాతన సమాజం . డార్విన్  సిద్దాంతం ఎంతటి అపురూపమైనదొ మార్క్స్ అదనపు విలువను కనిపెట్టడం ఎంతటి అసాదారణ విషయమొ అంతటి  అంతటి మహత్తరమైన గ్రంధమని ఎంగెల్స్ చెప్పెడు. ఒక వాక్యంలొ చెప్పలంటే ఈ విస్వమొక కుటుంభం మనపుర్వికులంతా ఒకరే మానవులంతా ఒకటే .

 కల్పనలు, అన్వ్యెషణలు ద్వారా మానవుడు అట్టడుగు నుంచి ఎలా క్రమ వికాసం చెందినది వెల్లడించాడు ఆయన ఒక్క రొజులొనొ లేక ఒక నెల లొనొ రాయలేదు. దాదాపు 40 యేళ్ళ పాటు అమెరికాలొని రెడ్ ఇండియన్లలొ వుండి  అక్కడి తెగలలొ దత్తత తీసుకొబడి తన అన్వెషణ ప్రరంభించాడు
  ఈ నాటికీ మన పాఠ్య పుస్తకాలలొ చరిత్రగతిలొ కుటుంభపడ్డతిలొ మార్పుపెమీ లేదన్నట్టుగా  ఈనాటి బుర్జువా కుటుభం పైదాని ప్రతిభింభమే అనుకుంటున్నారు మహా అయితె ఆదిమ కాలంలొ వావి వరసలు లేకుండా స్రీ , పురుషులు కలుస్తుండేవారని వప్పుకునేవారు.
   ఈ పుస్తకాన్ని ఈ మద్యనే విశాలాంద్ర వారు ముపై యేళ్ళ తర్వాత మళ్ళి అందుబాటులొకి తెచ్చారు.