18, జులై 2012, బుధవారం

వ్యక్తిత్వ వికాస పుస్తకాలూ --దాని తీరు తెన్నలు.


    వ్యక్తిత్వ వికాస పుస్తకం మొడట చదివింది ఏడేళ్ళ క్రితం యండమూరి గారి విజయానికి ఐదుమెట్లు ఆతర్వాత నాదౄక్పదం మారింది. ఈమద్య యక్కడ చుసినా t v ల లొనూ  అదే చర్చ పట్టాబి రాం గారు యండమూరి వీరేంద్రనాద్ లాంటి వాళ్ళు.  వాళ్ళే కాకుండా పుస్తక షాపుల్లొ "మీరు కొటీస్వర్లు కావడం ఎలా?" "మీ విజయం మీ చేతుల్లొ వుంది"   "డబ్బు సంపాదించడం ఎలా?" ఇలాంటి పుస్తకాలు డజన్ల కొద్దీ వున్నాయి.  ఈ మద్య డా: b v  పట్టభిరాం గారి "ఒక్కడు" పుస్తకం చదివాను దానిగురించి రాయాలంటే ఒక పుస్తకమే రాయవచ్చు.నేను కొన్నింటినే ప్రస్తావిస్తాను.


     సమాజంలొ ఒకపక్క పేదలూ, ఒకపక్క ధనికులూ, విడిపొయి పరస్పర శత్రువర్గాలుగా విడిపొయి వేల సంవత్సరాలక్రితమే జరిగిపొఇంది . ఆయా నిర్దిష్ట  సమాజంలొ బానిస, బానిసయజమానిగానూ, ప్యుడల్ దాసుడూ, ప్యుడల్ ప్రభువుగానూ , పెట్టుబడిదారుడూ,కార్మికుడుగానూ వుంటూవచ్చినారు . ఆస్తి ఒక నిర్దిష్ట వర్గానికి ఎప్పుడూ సమస్యగానే వుంటూ వచ్చింది. సమాజంలొ వున్న సమస్త భుములూ, ఘనులూ ఉత్పత్తి సాదనానూ, ఒక వర్గం చేతిలొ పొగుపడి వున్నాయి . దాన్ని బద్దలు కొట్టందే అవి కార్మిక వర్గానికి అందే మార్గం లేదు. సమాజమంటూ  ఒకటుంది దాన్ని విడిచి వ్యక్తిగత ఆదర్శాలూ, వ్యక్తిగత లక్ష్యాలూ ఏర్పరుచుకుంటే నీకు త్వరలొనే అర్దమౌతుంది నీ ఆర్దిక స్తితిగతులు వెనక్కునెట్టబడతాయి.

 వ్యక్తిత్వ వికాస నిపుణులు చెట్లనే తప్ప అడవిని చుడలేరు.పులిని చుసి ఒక వ్యక్తి బయపడితే ఆ బయానికి కారణం నీ మెదడులొవున్న ప్రత్యెక రసాయణం తప్ప బౌతికంగా వున్న ఆ పులి కారణం కాదంటారు వీళ్ళు. అలాగే ధనిక , పేద , తేడాలకుగల సమాజపు పునాదిని ఏమాత్రం పట్టించుకొరు. నీవు పేదవాడిగా వున్నావంటె నీవే కారణం నీ వ్యక్తిగత ఆ దర్శాలూ, లక్ష్యాలూ, లేవు కనుక అలా వున్నావంటారు.

 పట్టాబిరాం గారి పుస్తకాన్ని మూడు బాగాలుగా  విభజించుకొవచ్చు. 1. వ్యక్తిగత లక్ష్యాలూ, ఆదర్శాలూ పెట్టుకొవడం.2. కొంతమంది విజయం సాధించిన వారి జీవిత కథలను పదే పదే చెప్పడం. 3. నీతివాక్యాలు బొధించడం.
ఒకడు శిఖరాగ్రం చెరుకున్నాడంటె దానర్దమేమిటి ? అది ఎలాజరుగుతుంది? ఒకడు లక్షల కొట్లకు ఆస్తిపరుడైయ్యాడంటె  ఎలా అయ్యాడు? ఆ లాబాలు యలా వస్తున్నాయి? వడ్డీ అంటే ఎమిటి ? ఈ విషయాలన్ని ఈ కొతల రాయళ్ళకు పట్టవు. శిఖరాగ్రానికి వెళ్ళమని ఊకదంపుడు తప్ప. ఒకడు శిఖరాగ్రాన వున్నాడంటే వాడి కింద వేలమందిని శ్రమదొపిడీ చేస్తేనే వాడు శిఖరం పైన వుండగలడు. అందరూ శిఖరం పైకి వెళ్ళగలరా? అప్పుడు వాడికి శ్రమ చెసేవాడు యవడుంటాడు. చరిత్రను ఒకసారి గమనిస్తె అట్టడుగు వర్గానికి చెందిన వారు పైకి వెళ్ళిన వాళ్ళు కొట్లమందిలొ కేవలం వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. సమాజ వనరులన్నీ కొందరి చెతులలొ పొగుపడి వున్నాప్పుడు అందరూ శిఖరానికి చేరుకొవడం సాద్యం కాదు. ఊహాలొకంలొ విహరించడం మాత్రం కాయం.



        నీతి వాక్యాలు వల్లించడం : అసలు నీతి అంటే ఎమిటి ? అవినీతి అంటే ఎమిటి ? అవి ఎందుకున్నాయి?  నీతి అనేది ఆయా నిర్దిష్ట సమాజాలలొ మారుతూ వస్తుంది అది గడ్డకట్టి అన్ని సమాజాలకూ, ఒకే సుత్రం పనికి రాదు. బానిస సమాజంలొ బానిసకు ఏ హక్కులూ వుండవు ఆఖరికి అతన్ని చంపే హక్కు కుడా యజమానికుంది.అది బానిస సమాజంలొ నీతిగా చెలామని అయింది. అలాగే ప్యుడల్ , పెట్టుబడిదారీ సమాజాలలొ మారుతూ వస్తుంది. బాల్య వివాహాలూ , సతీసహగమనం, స్త్రీలను హింసించడం నేడు నేరం.
"లక్ష్యం  నిర్వర్తించుకొవాలంటె  తమ వైకరి , బలాబలాలు తెలుసుకొవాలి"
దీనర్తం ఎమిటంతే తమ విద్యా, ఆర్దిక స్తితిగతులనుపట్టి పొవాలని ఒకరు చెప్పినా చెప్పక పొయినా జరిగేది అదే . ఉత్పాదక పరిశ్రమ పెట్టాలనుకునే వారు  లేదా వ్యాపారం పెట్టదలుసుకున్నావారు గాని తమ ఆర్దిక స్తితిగతులను బేరీజు వేసుకునే చేస్తారు. ఒక పేదవ్యక్తి తమ కుమారుణ్ణి కార్పొరేట్ స్కూల్ లొ చెర్పించలేడు.ప్రబుత్వ బడికి పంపుతాడు.

పట్టాభిరాం గారు అర్దం ఆస్తికుడూ, అర్దం నాస్తికుడూ. జ్వొతిష్యం, ఉంగరాలు, మంత్రాలు, లాంటివి నమ్మవద్దంటాడు. నమ్మకాల్లొకి అతి పెద్దమూడనమ్మకమైన "దేవుడికి" కి సాష్టాంగ పడినాడు. ఇది అడుగడుగునా కనిపిస్తుంది. అమెరికాలొ ఇద్దరు పైకి వచ్చిన వాళ్ళగురించి చెప్తూ,ఒక గొప్ప గాయకుడి వీర్యాన్ని అక్కడి వనితలు అలాంటి కొడుకు కావాలని కుత్రిమంగా గర్బదారణ చేయించుకున్నారని చెప్పారు. మార్లిన్ మన్రొ అనే మరొ మొడల్ ఒక తొట్టె నిండా వైన్ నింపి దానిలొ స్తానం చేసిన తర్వాత ఆ వైన్ ని ఒక గ్లాసు అప్పటి ధరకు 100 రెట్లు అధిక ధరతొ అమ్మారని చాలా  ఉత్సాహంగా ఏ విమర్శా లేకుండా చెప్పారు ఎందుకంటె వాళ్ళు శికరానికి చేరుకున్నారు కదా!. " నేను సాధించగలను అని 21 సార్లు రాస్తె విజం సాదిస్తారు."
ఇకనేం 21 సార్లు రాసి కొటీస్వర్లు కాండి!.
" ఈ ప్రపంచంలొ ధనవంతుడిగా యవరూ జన్మించరు పేదవాడిగానూ జన్మించరు"
పట్టభిరాం గారికి ఎదొ అయినట్టు వుంది కనీసమైన వాస్తవాలు కుడా పరగణలొకి తీసుకొవడం లేదు.ధనవంతుడి పిల్లలు ధనవంతులుకాక ఇంకేమౌతారు? వాడి ఆస్తి ఆ పిల్లలకేరాసిస్తాడు కదా .పేదవాడి పిల్లలు పేదతనం తొనే బతుకుతారు. ఇలాంటి పుస్తకాలు చదవటం వలన తాత్కాలికమైన మనస్శాంతి అనేది కలుగుతుంది   అందులొ ఎమీసందేహం లేదు.  ఎప్పుడొ ఒకప్పుడు మనం  కుడా గొప్పవాళ్ళమైపొతామని ఒకరకమైన తెలియని సంతొషం కలుగుతుంది. మరొకాయన వుండాడు ఆయనే యండమూరి వీరేంద్రనాద్ ఈయనకు మరొ పేరు మంత్రాల రచయిత ఆయన నవల తులసిదళం లొ చేతబడిని బహుచక్కగా వర్నించారు. గతంలొ ఈ యనవల్ల ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది ఈయన వ్యక్తిత్వ వికాస నిపుణుడి అవతారం ఎత్తినాడు ఈయన మాట్లాడితే మీరు కారు కొనడంకొసం గొల్ పెట్టుకొండి ఇది తప్ప వేరేమాట రాదు. ఈయనకు పేదలంటే పరమ చీదర  ABN TV  చానల్లొ విత్ RK పొగ్రాం, చుడండి.


 పట్టభిరాం గారు. స్వాతంత్రం గురించి, రాజకీయాల గురించి రాసినారు. వాటి గురించి మరొసారి చర్చించుకుందాం. నా చిన్నప్పుడు  2వ తరగతిలొ అనుకుంటా బేష్ అనే పాటం వుండింది దానిలొ పొద్దునమనమూ లేవాలి పళ్ళూ బగాతొమాలి గ్లాసుడు పాలూ తాగాలి ఉతికినబట్టలు కట్టాలి ఇలా సాగుతుంది అది దానికి ఏమాత్రం తీసిపొకుండా కొన్నింటిని పాటించమని  .పొద్దున నడవటం , మంచిసంగీతం వినటం, గొరువెచ్చని నీటితొ స్తానం మొలకెత్తిన గింజలను తినడం ఇవి మద్య తరగతి మాత్రమే పాటించేటివి .ఈ వ్యక్తిత్వ నిపుణులు చెప్పేది ఎంతవరకు తీసుకొవచ్చునంటె ఇతరులపట్ల మన ప్రవర్తన పైన చెప్పిన కొన్ని అలవాట్లు .శిఖరాలు లక్ష్యాలు లాంటివి ఊహాలొకంలొ విహరించడమే.

1 కామెంట్‌: