10, జూన్ 2013, సోమవారం

ఆంద్రజ్యొతి లొ సురవరం సుధాకర్ రెడ్డి రాసిన వ్యాసంపై సమిక్ష

ఈ వ్యాసం జున్ 6న సురవరం సుధాకర్ రెడ్డి  చండ్ర రాజేస్వరావు శతజయంతి పురస్కరించుకుని ఆంద్రజ్యొతిలొ రాసిన వ్యాసానికి సమాదానంగా.
   దాన్ని చర్చించే ముందు తెలంగాణా సాయుధ రైతాంగ పొరాటం గురించి క్లుప్తంగా చెప్పుకుందాం.
    1946 నుండి 1951 చివరి వరకూ పూర్తిగా 5 సంవత్సరాలు తెలంగాణా సాయుధ ప్రతిఘటన గాధ విస్తరించింది.1948 సెప్టంబర్లొ భరత ప్రభుత్వం నైజాం సంస్తానంపై పొలీసు చర్య జరిపి ప్రతెక్ష అధికాం సంపాధించి జొక్యం కల్గిల్చుకునేదాకా ఆప్రతిఘటన అప్రతిహంగా సాగింది. కేంద్రం నుండి భరత ప్రభుత్వం సైన్యాలను పంపి తెలంగాణా ప్రజలకు విముక్తి కల్గిస్తున్నట్లుఇ ప్రకటించింది కాని వారు వాస్తవానికి వారు విముక్తి కల్గించింది వీర తెలాంగాణా రైతాంగానికి కాదు.-పారాన్న బక్కులైన భుస్వాములకూ వారి తాబేదార్లుకు.  పొరాడుతున్న రైతాంగంపై కసి తీర్చుకున్నారు. దాద్దాపు 50వేల మంది సైనికులు నిరాయుధులైన తెలంగాణా రైతు కులీలపై ప్రయొగించాలు. వారి ఆద్వరయంలొవున్న భుమిని భలవంతంగా లాకున్నారు. 4 వేలమంది రైతాంగం ఆహుతి అయ్యారు. లక్ష మంది స్త్రీ పురుషులు జైలళ్ళలొనూ భయటా చిత్రహింసలు అనుభవించారు. స్త్రీలు సామూహిక అత్యాచారం చేశారు. పురుషులను కళలొ కుడా ఊహించని విధంగా మల ముత్రాలు పొసి , భండ్లకు కట్టి ఈడ్చి సంపేరు. తలల్లొ మేకులు దిగపొడిచారు. బర్త ఎదుటే బర్యనూ, కుతుళ్ళనూ చెరిశారు. స్త్రీలను దిఘంభరంగా వేలాడతీశారు. వారి రొమ్ములు కొశారు. ఒక్క మాటలొ చెప్పాలంటే 50 వేల మంది సైన్యాలతొ ఫపిస్టు పాలన సాఘించారు నెహ్రూ సైన్యం.

1947 నుండి -48 వరకు కాస్మీర్ వివాదం పై పాకిస్తాంతొ జరిగిన యుద్దంలొ కర్చు పెట్టిన దానికన్నా ఎక్కువే పెట్టేరు తెలంగాణా రైతాంఘన్ని అణసటానికి.
   తెలంగాణా రైతాంగం నైజాం నవాబు పాపిస్టు పాలన నుంచి రైతాంగం సాధించుకున్న విజయాలు; వెట్టిచాకిరీ రద్దు, నిర్భంద దాన్యం చేకరణ లెవీ రద్దు. తరతరాలనుంచి అప్పు ఉన్నారంటూ వాళ్ళను బానిచలుగా చేసుకొవడం లేదా భుములు లాక్కొవడం నుంచి. దాదాపు 10 లక్షల యకరాలు ఆ పొరాటం సాయుద రైతాంగం సాధించుకుంది. 

  ఆసాదించుకున్న భుమిని తిరిగి భుస్వములకు అప్పగించడానికి నెహ్రూ సైన్యం రంగప్రవేశం చేసింది.  చండ్ర రాజేస్వరావు , రావి నారాయణ రెడ్డి .డి.వి.దేశపాండె లాంటి తిరొగమన మితనాద కమ్యునిస్టులు ఎమంటారంటె హైదరాబాదులొ నెహ్రు సైన్యం ప్రవేచించి మీదటే సాయుద రైతాంగం సాధించుకున్న విజయాలను ఎలాంటి ప్రతిఘటనా లేకుండా వాళ్ళకు వొప్పచెప్పి వుడాల్సిందని . చండ్ర రాజేస్వరావు "చారిత్రక తెలంగాణా పొరాటం" రావి నారాయణ రెడ్డి రాసిన "తెలంగాణా నగ్నసత్యాలు"  శత్రువు కుడా రాయలేని విషం కక్కెరు ఇద్దరూ.  మాకినేని బసవపున్నయ్య గారి మాటల్లొ చెప్పాలంటె.  1950-52 సంవత్సరాలలొ మితవాద కమ్యునిస్టు పార్టి ఏ తెలంగాణా పొరాటాన్ని దళారుల దౌజ్యన్యలాండయనీ, వ్యక్తిగత హిసావాదమనీ, రాజకీయ దుంకుడు చర్యనీ, దుమ్మెట్టి పొసిందొ ఆ పాఋతియే 1971 సంవత్సరాలలొ సాయుద రైతాంగ పొరాట రజొత్సవాన్ని అట్టహాస ప్రకటనతొ పుస్తకాలూ, వ్యాసాలు రాసి పంచుతుంది ఇందులొ చాలా వక్రబాస్యాలు,దివాళాకొరు రాజకీయవైకురులనూ ఆకాశానికెత్తి పొగడ్తులతొ ముంచెత్తుతుంది. "

1950-52 నాటి తీవ్ర విబేదాలు తెలంగాణా రైతాంగ పొరాటాన్ని 1948 తర్వాత కొనసాగించటం తప్పా? ఒప్పా? అన్న కీలక సమస్యకే పరిమితమైలేవు ఆ ముక్యబాగాన్ని కేంద్రంగా చేసుకుని అనేక విప్లవ విద్రొహ చర్యలూ, సుత్రాలూ నిర్మాణాలూ, నిర్మాణ పద్దతులూ ప్రవేశపెట్టెరు. నేటి మన రివిజినిస్టుగా నాటి తెలంగాణా పొరాటం పైనే ద్వజమెత్తిన కమ్యునిస్టు పెద్దలు.కాల క్రమేణా వారితొ కరచాలణం చేసి వారికే ప్రముఖనాయకుడయ్యరు కామేడ్ రాజేస్వరావు నేడు.
1. హైదరాబాదు సంస్తానంలొ కాంగ్రెస్ ప్రబుత్వ సైన్యాలు ప్రయేసించడం ప్రదాన ఉద్దేశం పొరాటాన్ని దాని ప్రతిఘటన విజయాలనూ దెబ్బతీయడమే ప్రదాన ఉద్దేసమని సుందరయ్య, బసవపున్నయ్య వాదనైతె.  కాదు నిజాం నిరంకుశ పాలనను కులదొచి సంస్తాన ప్రజలను విముక్తులం చేయడమే ప్రభుత్వ సైన్య ప్రదమ లక్ష్యమని రాజేస్వరావు, నారాయణ రెడ్డి మున్నగు వాదన.
తెలంగాణా పొరాటంలొ ప్రాణాలు అర్పించిన అమర వీరులకు జొహార్లు అర్పిదామంటున్నాడు రాజేస్వ్రావు.వేలాది మందిని హత్యచేయడానికీ,లక్షమంది స్త్రీ, పురుషులను హింసింసడానికీ, కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి అబ్యుదయ సర్ఫికెట్ తగిలించి దానితొ చేయీ చేయీ కలిపి జాతీయ ప్రజాస్వామ్యానికీ, శొషలిజానికీ, బాటలు వేయాలని శలవిస్తున్నాడు.

    శాంతియుత సహజీవనం, శాంతియుత ఆర్దికపొటీ, శాంతియుత శొషలిస్టు విప్లవ పరిఒణామం, అందులొ ఒక భాగంగానే  బుర్జువా వర్గంతొ యేకమై పెట్టుబడీదారియేతర పంతాద్వారా శాంతియుత శొషలిస్టు పంతా చేరడం, వగైరా మితవాద పిడివాదాన్ని చేపట్టేరు చండ్ర రాజేస్వర్ రావు ప్రబుతులు.  ఇక సురవరం సుధాకర్ రెడ్డి వ్యాసానికొద్దాం.
" హైదరాబాదు విలీనం తర్వాత సాయుదపొరాటాన్ని బలపరిచిన ప్రజాతంత్ర శక్తులూ, సాదారణ ప్రజలూ, సాయుద పొరాటపు అవసరంపై సంతౄప్తి చెందలేదు గ్రామాలనుంచి అడవిలొకి వెళ్ళంచిన అనిర్వార్య పరిస్తితి.ప్రజల మద్దతు క్షీనించింది".   ఈ పాచిపొయిన పాటను చండ్ర రాజేస్వర్ రావు , రావి నారాయణ రెడ్డి పాడగా పాడగా అరిగిపొయిన పాటను ఈ యన కొత్తగా ఎత్తుకున్నాడు. పొరాటంలొ ప్రజల సహకారం లేకపొతే నెహ్రూ నైన్యాలతొ 3 సంవత్సరాలు ఎలాపొరాడింది?. ఈ ఆత్మ గొష ఎమిటంటె రైతాంగం సాధించుకున్న భుములను తిరిగి భూస్వాములకు ఇవ్వలేదని.   బుర్జువా పార్టీలకూ సి. పి.ఐ పార్టికీ తేడా అంటూ ఎమీలేదు. ఇప్పుడైతే సి.పి.యం. కుడా లేదు.

  తెలకపల్లి రవి కుడా జున్ 6 న ఒక వ్యసం రాశాడు." ఇన్ని అవరొదాల ద్వరా సుంధరయ్య, రాజేస్వర్ రావు వంటి నాయకులూ ఆదర్శాలకు అంకితమై అశేష కార్యకర్తలుండం ద్వారా అరుణ పతాకం ఎగురుతునే వుంది"   ఈ తెలకపల్లి రవి సుందరయ్యనూ, రాజేస్వర్ రావునూ ఒకగాటన కట్టెడు.ఇద్దరి ఆదర్శాలూ ఒకటే అయినట్టు!!. ఇద్దరి ఆదర్శాలూ సిద్దాంతాలు వేరు అలాంటప్పుడు ఒకే గాటన ఎలాకట్టేరు రవి గారూ? ఈ గొర్రె తొలు కప్పుకున్న తొడేలుకు ఒక విక్షణ అంటూ వుండదు . అడ్డదిడ్డంగా పొతుంది బుర్జువా నాయకులనూ కమ్యునిస్టు నాయకులనూ కలి అందరికీ ఒకే ఆదర్శాలంటుంది. కొడి అన్ని దిబ్బల్లొ కెలికినట్టు అన్ని చానళ్ళూ తిరుగుతూ వుంటాడు. 


3 కామెంట్‌లు:

  1. కమ్యూనిజం అంటే ఏమిటో చెప్పకుండా తెలంగాణా పోరాట చరిత్ర యొక్క అరిగిపోయిన తిప్పితే వోట్లు పడతాయా? నేను ఈ టాపిక్‌లో మార్క్సిజం గురించి చర్చించదలచుకోలేదు. ఎందుకంటే మార్క్సిజం అనేది థియరీకి సంబంధించినది, వర్గ పోరాటం అనేది ప్రాక్టీస్‌కి సంబంధించినది, కమ్యూనిజం అనేది డెస్టినేషన్‌కి సంబంధించినది. కమ్యూనిజం గురించి ఒక్క ముక్కలో చెప్పమంటే మార్క్స్, ఎంగెల్స్ అయినా ఇలా చెపుతారు "ప్రైవేట్ ఆస్తిని రద్దు చెయ్యడం" అని. కానీ ఈ ఒక్క ముక్క గురించి కూడా మన ఉభయచర వామపక్ష పార్టీలు ప్రజలకి చెప్పవు. పాలక వర్గంతో వర్గ సహకారాన్ని బహిరంగంగా సమర్థించిన రావి నారాయణ రెడ్డి గురించీ, గాంధీలాగ పగటి వేషాలు వేసిన సుందరయ్య గురించీ గొప్పగా చెప్పి వోట్లు సంపాదించుకోవడం మాత్రం వీళ్ళకి బాగా నైపుణ్యం ఉన్న విద్య.




    రిప్లయితొలగించండి
  2. ప్రవీన్ గారూ. మీరు పొరపడినట్లు వున్నారు సుంధరయ్య గారు ఘాంధిలాగ పగటివేశాలు వేయలేదు. ఆయన వీర తెలంగాణా విప్లవపొరాటాలూ... ఇంకా అనేక సందర్బాలలొ పార్లమెంటరీ పంతాను విమర్చించారు. కేవలం ఓట్లకొసమొ లేదా పార్లమెంటరీ ద్వారా సొషలిజం వస్తుందనుకొవడ బ్రమని అనేక సందర్బాలలొ చెప్పారు.

    రిప్లయితొలగించండి
  3. But Sundaraiah got much publicity for his bicycle ride to the parliament. Marx said that neither he nor Engels allowed such cult on them.

    రిప్లయితొలగించండి